డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. ప్రజలు గడపదాటకుండా ఇళ్లకు తాళాలు..

ABN , First Publish Date - 2021-08-14T01:58:04+05:30 IST

సోషల్ మీడియాలో చైనాకు సంబంధించిన కొన్ని వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. డ్రాగన్ దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరు పీపీఈ కిట్లు ధరించి.. ఐరన్ రాడ్‌లు, సుత్తి, మేకులతో

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. ప్రజలు గడపదాటకుండా ఇళ్లకు తాళాలు..

బీజింగ్: సోషల్ మీడియాలో చైనాకు సంబంధించిన కొన్ని వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. డ్రాగన్ దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరు పీపీఈ కిట్లు ధరించి.. ఐరన్ రాడ్‌లు, సుత్తి, మేకులతో ఇంటింటికీ తిరుగుతున్న దృశ్యాలను ఆ వీడియోల్లో చూడొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారిని ప్రపంచానికి పరిచయం చేసిన డ్రాగన్ దేశాన్ని డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్ కారణంగా చైనాలో కొవిడ్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో.. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు సూచనలు చేశారు. అంతటితో ఆగడం లేదు. ప్రజలు గడపదాటడానికి వీళ్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తైవాన్‌లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా.. డోర్లకు అడ్డంగా ఐరన్ రాడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గేట్‌లకు తాళాలు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2021-08-14T01:58:04+05:30 IST