Abn logo
Jul 4 2020 @ 12:00PM

చైనా బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ లిన్ డాన్ సంచలన ప్రకటన

బీజింగ్ (చైనా):చైనా బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ లిన్ డాన్ శనివారం సంచలన ప్రకటన చేశారు. 36 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ తాను  రిటైర్‌ అవుతున్నట్లు శనివారం ప్రకటించారు.బీజింగ్, లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన లిన్ డాన్ రిటైర్ మెంట్ ప్రకటనతో వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనబోరు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఏడాది జరగాల్సిన టోకియో ఒలింపిక్స్ క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఆ క్రీడల్లో లిన్ డాన్ పాల్గొనరని సమాచారం. తన ప్రత్యర్థి అయిన మలేషియా స్టార్, స్నేహితుడు లీ చోంగ్ వీ రిటైర్ అయిన ఏడాది తర్వాత లిన్ తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. లీ చోంగ్ వీ, లిన్ డాన్ లు దశాబ్దానికి పైగా క్రీడల్లో వెలిగారు. లిన్ డాన్ 666 సింగిల్స్ లలో విజయాలు సాధించారు. తనకు కష్టతరమైన సమయంలో కుటుంబం, కోచ్‌లు, జట్టు సభ్యులు, అభిమానులు అండగా నిలిచారని లిన్ డాన్ ట్వీట్ చేశారు. డబుల్ ఒలింపిక్ స్వర్ణాలతో పాటు లిన్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. చాలా కాలం ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్ గా నిలిచిన లిన్ కు సూపర్ డాన్ గా పేరుంది.టోక్యో ఒలింపిక్స్‌కు చేరుకోవాలని తాను నిశ్చయించుకున్నానని, కానీ ప్రపంచంలో కరోనా వల్ల క్రీడలను వాయిదా వేయడంతో ఆ కలని అసంభవం చేసిందని లిన్ డాన్ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement