చైనాకు దీపావళి షాక్

ABN , First Publish Date - 2021-10-31T01:24:10+05:30 IST

భారత దేశంతో వ్యాపారం చేసే చైనా ఎగుమతిదారులకు

చైనాకు దీపావళి షాక్

న్యూఢిల్లీ : భారత దేశంతో వ్యాపారం చేసే చైనా ఎగుమతిదారులకు దీపావళి, తదితర పండుగల సమయంలో దాదాపు రూ.50 వేల కోట్లు నష్టం వాటిల్లబోతోంది. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చైనా ఉత్పత్తుల బహిష్కరణకు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలుపునివ్వడమే దీనికి కారణం.


చైనా నుంచి వస్తున్న చౌక బాణసంచా, ఇతర ఉత్పత్తులను భారతీయులు బహిష్కరించడంతో స్వదేశీ ఉత్పత్తులకు గిరాకీ పెరిగే అవకాశం ఉందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఓ ప్రకటనలో పేర్కొంది. పండుగల సందర్భంగా కస్టమర్లు మార్కెట్లకు రావడం పెరిగిందని తెలిపింది. దీపావళి అమ్మకాల ద్వారా భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.2 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేసినట్లు తెలిపింది. 


చైనా వస్తువులను బహిష్కరించాలని సీఏఐటీ గత ఏడాది పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా దీనిని కొనసాగించింది. దీంతో భారతీయ వ్యాపారులు చైనా వస్తువులను, బాణసంచాను దిగుమతి చేసుకోవడం లేదు. 


ఇటీవల కనిపించిన మరొక ముఖ్యమైన మార్పును కూడా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. భారతీయ వినియోగదారులు చైనా వస్తువులను కొనడానికి అంతగా ఆసక్తి కనబరచడం లేదని, ఫలితంగా భారతీయ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని చెప్తున్నారు. 


Updated Date - 2021-10-31T01:24:10+05:30 IST