Abn logo
Jun 30 2020 @ 20:24PM

టెన్‌సెంట్‌కు కొత్త భయం.. భారత్‌లో పబ్‌జీ కూడా..

బీజీంగ్: చైనాకు చెందిన 59 అప్లికేషన్లను భారత్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ గేమింగ్ దిగ్గజం టెన్‌సెంట్‌కు కొత్త భయం పట్టుకుంది. ఇన్ని యాప్స్‌ను ఒక్కసారిగా బ్యాన్ చేసిన భారత్ పబ్‌జీ మొబైల్‌ను కూడా నిషేధిస్తుందేమోనని వణికిపోతోంది. పబ్‌జీ మొబైల్ ద్వారా భారత్‌ నుంచి వేల కోట్ల రూపాయలు టెన్‌సెంట్ జేబులోకి చేరుతున్నాయి. అయితే ఇటీవల భారత్ నిషేధించిన చేసిన అప్లికేషన్ల జాబితాలో టెన్‌సెంట్‌కు చెందిన వియ్ చాట్ కూడా ఉంది. దీంతో తమ సంస్థకు చెందిన పబ్‌జీని కూడా భారత్ బ్యాన్ చేస్తుందేమోనని టెన్‌సెంట్ యాజమాన్యం భయపడిపోతోంది. ఒకవేళ అదే జరిగితే సంస్థకు వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. తిరిగి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.

Advertisement
Advertisement