ఒక్క కవిత షేర్ చేయడంతో 18వేల కోట్ల నష్టం.. వ్యాపారవేత్తకు చైనా వార్నింగ్!

ABN , First Publish Date - 2021-06-19T12:18:49+05:30 IST

చైనాకు చెందిన బిలియనీర్ ఒక పురాతన కవితను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అదే అతను చేసిన తప్పు. ఈ కవిత వల్ల అతను తీవ్రంగా నష్టపోయాడు. దానికితోడు తాజాగా చైనా ప్రభుత్వం ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఒక్క కవిత షేర్ చేయడంతో 18వేల కోట్ల నష్టం.. వ్యాపారవేత్తకు చైనా వార్నింగ్!

బీజింగ్: చైనాకు చెందిన బిలియనీర్ ఒక పురాతన కవితను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అదే అతను చేసిన తప్పు. ఈ కవిత వల్ల అతను తీవ్రంగా నష్టపోయాడు. దానికితోడు తాజాగా చైనా ప్రభుత్వం ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చింది. అతనే మెయిటువాన్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్. 1100 సంవత్సరాల ఒక పురాతన కవితను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడమే అని కొందరు కామెంట్ చేయడంతో ఆయన కంపెనీ మార్కెట్ విలువ 26 బిలియన్ డాలర్లు కోల్పోయింది. జింగ్ వ్యక్తిగత సంపదలో కూడా 2.5 బిలియన్ డాలర్లు (రూ.18,365 కోట్లపైగా) నష్టపోయారు. ఆయన్ను పిలిపించిన చైనా ప్రభుత్వం కొంత కాలం జాగ్రత్తగా ఉండాలని, తలవంచుకొని తప్పుకుపోతే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చిందట.

Updated Date - 2021-06-19T12:18:49+05:30 IST