Abn logo
Sep 21 2021 @ 16:51PM

గంటల వ్యవధిలో రూ. 7300 కోట్లు హాం ఫట్.. ఓ బిలియనీర్‌కు భారీ షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: కేవలం గంటల వ్యవధిలోనే ఒక బిలియనీర్ ఏకంగా రూ. 7300 కోట్లు నష్టపోయారు. సోమవారం ఉదయం 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద మధ్యాహ్నానికల్లా కేవలం 250.7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. పతనం అంచుకు చేరుకున్న చైనా బిలియనీర్ జాంగ్ యువాన్‌లింగ్ ఉదంతం ఇది. చైనాలో జాంగ్ యువాన్‌లింగ్‌ది తిరుగులేని స్థానం..ఆయనో రియల్ ఎస్టేట్ కింగ్. జాంగ్ ఆధ్వర్యంలోని సినిక్ హోల్డింగ్స్‌ గ్రూప్ సంస్థలు చైనాలో ఎన్నో అపార్ట్‌మెంట్లను నిర్మించింది. ఫోర్బ్స్ సంస్థ రూపొందించే అపర కుబేరుల జాబితాలోనూ ఆయన చోటు సంపాదించారు.


కానీ..సోమవారం మాత్రం ఆయనకు భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఒక్కసారిగా వెనక్కు తీసుకోవడంతో కంపెనీ షేర్లు ఏకంగా 87 శాతం పతనమైంది. దీంతో.. ట్రేడింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. సంస్థ తాను జారీ చేసిన బాండ్లపై చెల్లించాల్సి వడ్డికి తుది గడువు మరి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ ఈ వడ్డీని చెల్లించలేక కుప్పకూలుతుందనే భయాలు మొదలవడంతో ఇన్వెస్టర్లు సినిక్‌లో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే.. ఈ పరిస్థితి ఒక్క సినిక్‌కే పరిమితం కాదు. చైనాలోని అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రస్తుతం ఇదే దుస్థితిలో ఉన్నాయి. అసలు చైనా రియల్ ఎస్టేట్ రంగమే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. దీనంతటి వెనుకా ఉన్న ఒకే ఒక సంస్థ ఎవర్ గ్రాండే..!

ఎవర్ గ్రాండే..చైనాకు చెందిన ఓ భారీ రియల్ ఎస్టేట్ సంస్థ. అక్కడ దాదాపు 280 నగరాల్లో 1300కు పైగా ప్రాజెక్టులను  చేపట్టింది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు..  ప్రపంచంలోనే అత్యధికంగా అప్పులున్న రియల్ ఎస్టేట్ సంస్థగా ఎవర్ గ్రాండే అపఖ్యాతి మూటగట్టుకుంది. వేగంగా విస్తరించే క్రమంలో ఎవర్ గ్రాండే భారీగా రుణాలు సమీకరించింది. ఫలితం..అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయింది. ఇక బిలియనీర్లకు కళ్లెం వేసే పనిలో బిజీగా ఉన్న చైనా అధ్యక్షుడు జీ జీంగ్‌పింగ్ రియల్ ఎస్టేట్ రంగంపైనా కన్నేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎన్ని ఆస్తులు ఉండాలనే అంశంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

ఇవీ చదవండి:

భర్తను చంపి మృతదేహాన్ని రసాయనాల్లో కరిగించేద్దామనుకుంటే.. చివరకు జరిగింది ఇదీ..

రైల్లో ఒంటరిగా మహిళ జర్నీ.. తన సీట్లోనే కూర్చుని నిద్రలోకి.. సడన్‌గా నిద్రలోంచి లేచి చూస్తే ఎదురుగా..

ఫలితంగా.. ఎవర్ గ్రాండే తన నిధుల లభ్యత పెంచుకునేందుకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అత్యధిక డిస్కౌంట్లకు మార్కెట్లో విక్రయించాల్సి వచ్చింది. లాభాలు సంగతి అటుంచితే.. కనీసం వ్యాపారాన్నైనా ఎలాగొలా కొనసాగించాలనేది కంపెనీ ప్లాన్. కానీ..అది ఆశించిన  ఫలితం ఇవ్వలేదు. మరోవైపు.. ఎవర్ గ్రాండే తీసుకున్న అప్పులపై వడ్డీ కింద గురువారం నాడు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. దీంతో..కంపెనీకి ఒడిదుడుకుల తప్పవని ఇన్వెస్టర్ల బలంగా విశ్వసిస్తున్నారు. ఈ భయాలు కంపెనీ షేర్లపైన పెను ప్రభావం చూపించాయి. దీంతో.. సోమవారం నాడు షేర్ల విలువ ఏకంగా 11 శాతం పతనమైంది. ఈ నెగెటివ్ సెంటిమెంట్ మొత్తం రియల్ ఎస్టేట్ రంగంపైనే పడింది. దీంతో.. ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకుంటుండతో అనేక కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. 

ఇప్పటికే అనేక మంది కస్టమర్లు ఎవర్‌గ్రాండే అడ్వాస్సుల కింది భారీ మొత్తాలను చెల్లించారు. ఈ ప్రాజెక్టులు ఇంకా మొదలు కాలేదు. ఎవర్ గ్రాండే దివాలా తీస్తే గనుకు వీరందరూ తమ సొమ్ము కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ఎవర్ గ్రాండే సంస్థపై ఆధారపడి అనేక  రియల్ ఎస్టేట్ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో వీటి భవిష్యత్తుపైనా నీలి నీడలు కమ్ముకున్నాయి.  చైనా ఆర్థిక వ్యవస్థపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉంది.  చైనాలోని 171 బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎవర్ గ్రాండే భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. దీంతో.. ఆ సంస్థ దివాళా తీస్తే..ఆ ప్రభావం క్రెడిట్ మార్కెట్‌పై పడి రుణాల వితరణ మందగిస్తుందని ఆర్థికనిపుణుల వ్యాఖ్యానిస్తున్నారు. చైనా జీడీపీలో మూడో వంతు వాటా రియల్ ఎస్టేట్ రంగానిదే కావడంతో ఎవర్ గ్రాండే ప్రాధాన్యం మరింత పెరిగింది. ఎవర్ గ్రాండే పతనమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న విషయం చైనా పెద్దలకు తెలుసునని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితి చేయి దాటకమునుపే..వారు రంగంలోకి దిగి సంక్షోభం సద్దుమణిగేలా చేస్తారనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది.   

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...