Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: సీఎం జగన్‌ను కలిసిన చినజీయర్ స్వామి

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని త్రిదండి చినజీయర్ స్వామి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్... చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ జరుగనుంది. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చినజీయర్‌ స్వామితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు...సీఎం జగన్‌ను కలిశారు. 


Advertisement
Advertisement