సహస్రాబ్ది ఉత్సవాలకు మోదీని ఆహ్వానించిన చినజీయర్‌స్వామి

ABN , First Publish Date - 2021-09-19T00:43:45+05:30 IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం దివ్యవసాకేంతలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే రామానుజాచార్యుల

సహస్రాబ్ది ఉత్సవాలకు మోదీని ఆహ్వానించిన చినజీయర్‌స్వామి

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం దివ్యవసాకేంతలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానిస్తూ అధ్యాత్మిక గురువు త్రిదండి చిన జీయర్‌స్వామి ఆహ్వానపత్రిక అందజేశారు. మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుతో కలిసి శనివారం ఢిల్లీలో మోడీని కలిశారు. 216 అడుగుల పంచలోహ విగ్రహవిష్కరణకు తప్పక రావాలని కోరారు. విగ్రహ విశిష్టతను ప్రధానికి చినజీయర్‌ విరించారు. ప్రపంచ శాంతికి చిన జీయర్‌చేస్తున్న కృషిని అభినందించి విగ్రహావిష్కరణకు తప్పకుండా వస్తానని ప్రధాని హామీఇచ్చిన్నట్లు స్వామిజీ సన్నిహితులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు సీజే, కేంద్ర హోంత్రి, ఢిల్లీలోని ఇతర ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరుగుతాయని సాకేతం నిర్వాహకులు పేర్కొన్నారు.

Updated Date - 2021-09-19T00:43:45+05:30 IST