Abn logo
Jan 14 2021 @ 15:46PM

రామతీర్థం చేరుకున్న చినజీయర్‌ స్వామి

విజయనగరం: త్రిదండి చినజీయర్‌ స్వామి రామతీర్థం చేరుకున్నారు. ప్రధాన ఆలయంలో స్వామివారిని జీయర్‌స్వామి దర్శించుకున్నారు. ఇటీవల ఏపీలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై ఆయన మండిపడ్డారు. ఆలయాల్లో విగ్రహాలకు రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థం ఘటనలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారు. రామతీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానం పక్కనే సుమారు 800 అడుగుల ఎత్తులో ఉన్న బోడికొండపై కోదండ రామాలయం ఉంది. అందరూ కలసి ఆలయం లోపల పరిశీలించగా శ్రీరామచంద్రస్వామి విగ్రహం తల తెగి ఉండడాన్ని గుర్తించారు. 

Advertisement
Advertisement
Advertisement