గ్రామ సచివాలయ ఉద్యోగులపై దౌర్యన్యం చేసి.. విధులకు ఆటకం కల్పించారని..

ABN , First Publish Date - 2020-08-15T18:18:48+05:30 IST

పెనుమూరు మండలం చిన్న కలికిరి గ్రామ సచివాలయ ఉద్యోగులపై..

గ్రామ సచివాలయ ఉద్యోగులపై దౌర్యన్యం చేసి.. విధులకు ఆటకం కల్పించారని..

సచివాలయ ఉద్యోగులపై దౌర్జన్యం

గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ఫిర్యాదు

10 మందిపై కేసు నమోదు 


వెదురుకుప్పం(చిత్తూరు): పెనుమూరు మండలం చిన్న కలికిరి గ్రామ సచివాలయ ఉద్యోగులపై దౌర్యన్యం చేసి విధులకు ఆటకం కల్పించారని నంజరపల్లె ఆది ఆంధ్రవాడకు చెందిన పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (ఎంఎస్‌కే) ప్రియదర్శిని ఫిర్యాదు మేరకు.. ప్రియదర్శిని చిన్నకలికిరి గ్రామ సచివాలయంలో ఎంఎస్‌కేగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న నంజరపల్లెకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఆ గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. బ్యానర్‌ ఏర్పాటు చేశారు.


అయినా గ్రామానికి చెందిన కొందరు నిత్యం బయట తిరుగుతున్నారని అదే ఊరికి చెందిన మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఎంఎస్‌కే, ఏఎన్‌ఎం, కార్యదర్శి, వలంటీర్లు గ్రామానికి వెళ్లారు. ఇంటింటికీ వెళ్లి బయట తిరగరాదని అవగాహన కల్పిస్తుండగా కిరణ్‌కుమార్‌ వర్గీయులు అడ్డుకున్నారు. బ్యానర్‌ను తొలగించారు. మరోసారి గ్రామానికి వస్తే సహించేదిలేదని బెదిరించారు. దీంతో ఎంఎస్‌కే పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు  జె.కిరణ్‌కుమార్‌, హరికృష్ణ, జె.సతీష్‌కుమార్‌, జె.మహేష్‌బాబు, జె.అరుణ్‌కుమార్‌, జె.శ్రీనివాసులు, జె.మనోహర్‌, జె.చరణ్‌కుమార్‌, సుధాకర్‌, చిట్టిబాబుపై కేసు నమోదు చేశారు. 


Updated Date - 2020-08-15T18:18:48+05:30 IST