రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-07-13T17:18:57+05:30 IST

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని..

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: చినరాజప్ప

సామర్లకోట(తూర్పు గోదావరి): రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. అచ్చంపేటలోని ఆయన నివాసంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో సామాన్య ప్రజల నుంచి టీడీపీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులపైనా వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదలను బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన 13 నెలల పాలనలో 800 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని, 11 మందిని హత మార్చారన్నారు. వైసీపీ నేతల వేధింపులను తట్టుకోలేక 7 గురు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో మహి ళలకు భద్రత లేకుండా పోయిందని మహిళలు చిన్నారులపై సుమారు 210 అత్యాచారాలు జరిగాయన్నారు. సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని, తప్పులు ఎత్తి చూపితే సరిదిద్దుకోవాలని తప్పుడు కేసులు బనాయించడం సరికాదని  చినరాజప్ప అన్నారు. 


Updated Date - 2020-07-13T17:18:57+05:30 IST