చింతలరాయుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-25T09:33:20+05:30 IST

పట్టణంలో వెలసిన చింతల వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. విష్వక్సేన ఆరాధన, మృత్సంగ్రహణం,..

చింతలరాయుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తాడిపత్రి, అక్టోబరు 24: పట్టణంలో వెలసిన చింతల వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. విష్వక్సేన ఆరాధన, మృత్సంగ్రహణం, అంకురార్పణ, రక్షాబంధన పూజలు చేశారు. నవంబరు 2 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.   ఆదివారం ఉదయం ధ్వజారోహణం, శమీదర్శనం, సాయంత్రం శేషవాహనం, సోమవారం ఉదయం సింహవాహనం, సాయంత్రం హంసవాహనం, మంగళవారం ఉదయం సూర్యప్రభవాహనం, రాత్రి చంద్రప్రభ వాహ నం, బుధవారం ఉదయం మోహినీ అలంకారం, రాత్రి గరుడోత్సవం, గురువారం ఉదయం తిరుచ్చిఉత్సవం, రాత్రి హనుమద్‌వాహనం, శుక్రవారం ఉదయం వేణుగోపాలస్వామి అలంకరణ, రాత్రి గజవాహనం, శనివారం ఉదయం 10:30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, రాత్రి సర్వభూపాల వాహనం, ఆదివారం ఉదయం తిరుచ్చి ఉత్సవం, రాత్రి అశ్వవాహనం, సోమవారం ఉదయం చక్రస్నానం,  సాయంత్రం, ధ్వజారోహణం, కుంభప్రోక్షణ, భట్టర్‌ మర్యాదలతో ఉత్సవాలు ముగియనున్నాయి. కరోనా నేపథ్యంలో ఏకాంత పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.

Updated Date - 2020-10-25T09:33:20+05:30 IST