విద్యార్థుల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత

ABN , First Publish Date - 2021-12-08T05:11:18+05:30 IST

అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

బోడిగూడెంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని,టీడీపీ నాయకులు


కొయ్యలగూడెం, డిసెంబరు 7 : అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. డ్రెయినేజీ వ్యవస్థ, స్కూల్‌ పరిసరాలు, మంచినీరు సరఫరా అయ్యే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నలుగురు విద్యార్థుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇంత నష్టం జరిగి విద్యార్థులు మృత్యువాత పడినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన స్పందన లేదని విమర్శించారు. ఇప్పటికీ సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, మరోప్రాణం పోకుండా చర్యలు తీసుకో వాలన్నారు. టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌, పార్టీ మండల అధ్యక్షుడు వాడపల్లి నాగార్జున, నక్కా రవి, గంగిరెడ్ల మేఘలాదేవి, చింతల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


కొనసాగుతున్న వైద్య శిబిరం


బోడిగూడెంలో మంగళవారం వైద్య శిబిరం కొనసాగింది. 27 మందికి మలే రియా, చికున్‌ గున్యా, డెంగీ టెస్టులు నిర్వహించారు. కొయ్యలగూడెం ప్రభుత్వా సుపత్రిలో ఇద్దరు విద్యార్థులు, ఒక మహిళ చికిత్స పొందుతున్నారు. ఇంటింటా సర్వే కొనసాగుతోంది. ఎవరికి ఏ విధమైన అనారోగ్యం లక్షణాలు కనిపించినా వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా తమ గ్రామంలో ఈ అనారోగ్య పరిస్థితి ఏమిటని స్థానికులు వాపో తున్నారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్‌ నాగమణి గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. గ్రామ రహదారులన్నీ పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీఒక్కరూ కాచి చల్లార్చిన మంచినీటినే తాగాలని, వేడిగా వున్న ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. 


Updated Date - 2021-12-08T05:11:18+05:30 IST