Oct 25 2021 @ 10:08AM

పెళ్ళివేడుకలో మెగా‌బ్రదర్స్ సందడి!

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఆలింగనం చేసుకొని, నవ్వులు చిందించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తనయుడి వివాహ మహోత్సవం దానికి వేదికగా మారింది. అన్నదమ్ములిద్దరూ ప్రేమ పూర్వకంగా ఆలింగనం చేసుకొని ఫోటోలకు నవ్వుల పోజులివ్వడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆ ఇద్దరినీ అలా చూడడం ఈ మధ్యకాలంలో ఇదే కావడంతో వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. 


‘మా’ఎలక్షన్స్ సందర్భంగా చిరు, పవన్ వార్తల్లో నిలవడంతో.. ఆ ఇద్దరి మధ్యా పొరపొచ్చాలొచ్చాయనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వివాహవేదిక వాటికి ఫుల్ స్టాప్ పెట్టడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మెగా అన్నదమ్ములిద్దరూ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. పవర్ స్టార్ వైట్ అండ్ వైట్ లో రివీలయితే. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ ను మెయిన్ టెయిన్ చేస్తున్నారు.