రేర్ పిక్: బాలీవుడ్ మూవీ పార్టీలో చిరు ఇలా..

హీరో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘ఖైదీ రుద్రయ్య’. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో టి. త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ఈ చిత్రం ప్రారంభించే సమయానికి శ్రీదేవి బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌. తెలుగు చిత్రాల్లో నటించడం బాగా తగ్గించారు. హయ్యెస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసి, అతికష్టం మీద ఆమె డేట్స్‌ సంపాదించారు త్రివిక్రమరావు. తెలుగులో హిట్‌ కావడంతో అదే కథను హిందీలో ‘వక్త్‌ కీ ఆవాజ్‌’ పేరుతో ఆయన నిర్మించారు. మిధున్‌ చక్రవర్తి హీరో. శ్రీదేవి హీరోయిన్‌. కె.బాపయ్య దర్శకత్వం వహించారు. 


చెన్నైలో ‘వక్త్‌ కీ ఆవాజ్‌’ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. అదే రోజు రాత్రి జరిగిన పార్టీకి మిధున్‌తో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, హిందీ హీరో జితేంద్ర, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆ పార్టీలో చిరు ఇలా కనిపించారు. మిథున్‌కి, శ్రీదేవికి మధ్య ‘సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌’ అనే ప్రచారం జరుగుతున్న రోజులవి. ఈ కారణంగా వీరిద్దరి మధ్య తను నలిగిపోయాననీ, షూటింగ్‌ షెడ్యూల్స్‌ కూడా డిలే అయ్యాయని ఓ సందర్భంలో నిర్మాత త్రివిక్రమరావు చెప్పారు.

-వినాయకరావు

Advertisement
Advertisement