Mar 26 2020 @ 09:13AM

సోషల్ మీడియాలో మెగా సత్తా!

నూతన సంవత్సరాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు మెగా కానుకను అందించారు.  సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ప్రారంభించారు. ఈ ఖాతాలను ప్రారంభించిన 24 గంటలలోపే రికార్డు స్థాయిలో ఫాలోవర్లను సంపాదించారు. 


@KChiruTweets పేరుతో ట్విటర్ అకౌంట్‌ను ప్రారంభించిన చిరంజీవి తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ తొలి ట్వీట్ చేశారు. ప్రారంభించిన 24 గంటలలోపే చిరంజీవి ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య లక్ష దాటేసింది. అలాగే @chiranjeevikonidela పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రారంభించి తల్లితో దిగిన ఫొటోను మొదట పోస్ట్ చేశారు. గురువారం ఉదయానికి చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షలకు చేరువగా ఉంది. మొత్తానికి సోషల్ మీడియాలో కూడా చిరంజీవి తన స్టామినాను చాటుతున్నారు.