Jun 11 2021 @ 23:06PM

బన్నీ కోసం ‘పుష్ప’లో మెరవబోతోన్న మెగాస్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘పుష్ప’ సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని మొదట ఒకే పార్ట్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రీసెంట్‌గా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నటించే వారి విషయంలో రోజుకో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా మెరవబోతున్నారంటూ తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. సుకుమార్ సినిమాలంటే స్పెషల్ సాంగ్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ సినిమా కోసం దేవిశ్రీ ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ రెడీ చేశాడనేలా వార్తలు వచ్చాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో బన్నీ కోరిక మేరకు మెగాస్టార్ కూడా ఓ స్టెప్ వేయబోతున్నట్లుగా తెలుస్తుంది. చిరు, బన్నీ కలిసి ఈ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వేయబోతున్నారట. అధికారికంగా సమాచారం లేదు కానీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త బాగానే హల్‌‌చల్ చేస్తోంది. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.