Abn logo
May 8 2020 @ 20:43PM

మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌లో మెగాస్టార్‌..!!

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి త‌న 152వ సినిమా ‘ఆచార్య‌’తో బిజీగా ఉన్నారు. క‌రోనా ప్ర‌భావంతో ఈ సినిమా షూటింగ్ ఆగింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన త‌ర్వాత ‘లూసిఫ‌ర్’ రీమేక్‌లో చిరంజీవి నటించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తాను సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని చిరంజీవి తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ బాబీ త‌న‌ను క‌లిసి క‌థ కూడా చెప్పాడ‌ని చిరు తెలిపారు. తాజా స‌మాచారం మేర‌కు బాబీ డైరెక్ట్ చేయ‌బోయే సినిమా ఓ మ‌ల్టీస్టార‌ర్ స‌బ్జెక్ట్ అని, ఇందులో చిరంజీవితో రానా ద‌గ్గుబాటి న‌టించే అవకాశాలున్నాయ‌ని టాక్ విన‌ప‌డుతోంది. అంతా ఓకే అయితే  చిరంజీవి, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్కుతుంది. 

Advertisement
Advertisement
Advertisement