Oct 21 2021 @ 14:31PM

Director Bobby : ఊరమాస్ అవతార్ లో మెగాస్టార్ !

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను విడుదలకు రెడీ చేశారు. దీని తర్వాత రెండు సాలిడ్ రీమేక్స్ కు కమిట్ అయ్యారు. అలాగే.. దర్శకుడు బాబీ దర్శకత్వంలో సినిమాని కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నారు. దీనికి ‘వాల్తేర్ శీను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరుని ఊరమాస్ గా ప్రెజెంట్ చేయబోతున్నారట దర్శకుడు. ‘ముఠామేస్త్రి’లో ఆయన చేసిన మాస్ రోల్ ను గుర్తుకు తెచ్చేలా.. సరిగ్గా అలాగే ఆయన పాత్రను డిజైన్ చేశారట బాబీ. చిరంజీవి బర్త్ డే సందర్బంగా విడుదలైన ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లోనే ఆ విషయం అర్ధమైంది. వైజాగ్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో అదిరిపోయే కథతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అలాగే ఇందులో ఆయన మార్క్ డ్యాన్సులకు ఏమాత్రం ఢోకా ఉండదట. పరుచూరి బ్రదర్స్ పర్యవేక్షణలో ఈ సినిమా స్ర్కిప్ట్ కు మెరుగులు దిద్దుతున్నారట బాబీ. ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ సినిమాల్లో కూడా చిరు మాస్ అవతారాల్లోనే కనిపిస్తారు. అయితే బాబీ సినిమాలో అంతకు మించి అనే స్థాయిలో మెగాస్టార్ ను చూపించబోతున్నారట దర్శకుడు బాబీ. మరి నిజంగానే ఈ మూవీలో అభిమానులకు వింటేజ్ మాస్ మెగాస్టార్ దర్శనమిస్తారేమో చూడాలి.