Advertisement

పునరాలోచన చేయండి : చిరంజీవి

సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం  పునరాలోచన చేయాలని  మెగాస్టార్‌ చిరంజీవి కోరారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు. "ట్రాన్పరెన్సీ కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదే సమయంలో థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో  కుటుంబాల బతుకుతెరువు కోసం.. కాలానుగుణంగా, సముచితంగా  దేశంలోని  అన్ని రాష్ట్టాల్లో ఉన్నట్లు నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు టికెట్‌ ధరల విషయంలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు. 



Advertisement