Oct 23 2021 @ 17:16PM

ప్రభాస్‌కు చిరు శుభాకాంక్షలు!

డార్లింగ్‌ ప్రభాస్‌కు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  ‘హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ ప్రభాస్‌. రాబోయే రోజులు నీకు మరింత బావుండాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం విడుదల చేసిన ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ ప్రస్తుతం  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.