May 16 2021 @ 14:12PM

బాల‌య్య సినిమా... ట్రైల‌ర్‌లో న‌టించిన చిరు, విజ‌య‌శాంతి

నందమూరి బాల‌కృష్ణ న‌టించిన ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ట్రైల‌ర్‌లో అగ్రతార‌లు చిరంజీవి, విజ‌యశాంతి న‌టించారు. ఇంతకీ ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏది?.. చిరు, విజ‌యశాంతి ఎందుకు న‌టించారు? అనే వివ‌రాల్లోకి వెళితే.. నంద‌మూరి బాల‌కృష్ణ‌, సింగీతం శ్రీనివాస‌రావు కాంబినేష‌న్‌లో శివలెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ టైమ్ మిష‌న్ ఆధారంగా ర‌న్ అవుతుంది. ఇందులో బాల‌కృష్ణ శ్రీకృష్ణ దేవ‌రాయ‌లుగానూ క‌నిపించారు. అప్ప‌డు సినిమా నిర్మాణం కోసం కోటి అర‌వై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఖర్చు పెట్టారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ప్ర‌స్తావించాల్సిన విశేష‌మేమంటే.. ఈ సినిమా గురించి గొప్ప‌గా చెబుతూ దూర‌ద‌ర్శ‌న్ కోసం నాటి మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు చిరంజీవి, నాయిక విజ‌య‌శాంతి ఓ ట్రైల‌ర్‌లో న‌టించారు. చిరంజీవి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను తీసుకుని ట్రైల‌ర్ కాన్సెప్ట్ డిజైన్ చేసుకుని మ‌రీ న‌టించారు. 

Something Specialమరిన్ని...