Abn logo
Mar 26 2020 @ 16:50PM

రూ. కోటి విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం కరోనా పేరు నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. అదెలా అనుకుంటున్నారా? మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీతో. అవును ఉగాది పండుగ రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. తన ట్వీట్స్‌తో అందరినీ అలరిస్తున్నారు. మెగాస్టార్ అంటే ఏమిటో ఇక్కడ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు స్వాగతం పలికిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ.. తన ఛమక్కులతో ట్విట్టర్ ఇండియాని షేక్ చేస్తున్నారు. తాజాగా చిరు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం రూ. కోటి విరాళంగా ఇస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ప్రభుత్వాలకు పవన్ రూ. 2 కోట్లు, రామ్ చరణ్ రూ. 70 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.


‘‘ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గం. అయితే ఈ లాక్‌డౌన్ ఎందరో ఉపాధిని కోల్పోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం నా వంతు బాధ్యతగా రూ. కోటి విరాళాన్ని అందజేస్తున్నాను..’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement