Abn logo
Mar 26 2020 @ 15:30PM

చిరు ట్వీట్‌కి మోహన్ బాబు అదిరిపోయే రిప్లై

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీకి ఘనస్వాగతం లభిస్తోంది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు చిరుకి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు, చిరుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మెగాస్టార్‌కి స్వాగతం చెబుతూ వెల్‌కమ్ మిత్రమా అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా ధన్యవాదాలు చెప్పిన చిరు... రాననుకున్నావా.. రాలేననుకున్నావా అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌కు డైలాగ్ కింగ్ మరింత హాస్యాన్ని జోడిస్తూ... ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను అంటూ తనదైన శైలిలో కౌంటర్ రిప్లై ఇచ్చారు. దీంతో నెట్టింట భలే సందడి నెలకొంది. ఈ ఇద్దరి మధ్య మైత్రీబంధం తెలిసిన వారు హాయిగా నవ్వుకుంటున్నారు. 


Advertisement
Advertisement
Advertisement