చిత్రాన్నం

ABN , First Publish Date - 2021-10-09T18:25:58+05:30 IST

బియ్యం - ఒకకప్పు, పసుపు - అర టీస్పూన్‌, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, శనగపప్పు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - మూడు, ఎండుమిర్చి - మూడు, నూనె - ఐదు టీస్పూన్లు

చిత్రాన్నం

కావలసినవి: బియ్యం - ఒకకప్పు, పసుపు - అర టీస్పూన్‌, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, శనగపప్పు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - మూడు, ఎండుమిర్చి - మూడు, నూనె - ఐదు టీస్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత, పల్లీలు - ఒక టీస్పూన్‌. 


తయారీ: ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేగించాలి. తరువాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చి, పసుపు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు అన్నం వేసి, నిమ్మరసం పోసి సమంగా కలిసేలా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకొని దింపుకోవాలి. దుర్గాష్టమి రోజున చిత్రాన్నం నైవేద్యంగా సమర్పించాలి.

Updated Date - 2021-10-09T18:25:58+05:30 IST