May 11 2021 @ 14:24PM

ఆలస్యంగా చిత్రం 1.1 ..?

బాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తేజ 'చిత్రం' సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో 40 మందికి పైగా కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. చిత్రంతోనే ఉదయ్ కిరణ్, రీమా సేన్ ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఒక వెలుగు వెలిగారు. ఇటీవల 'చిత్రం 1.1' టైటిల్‌తో సీక్వెల్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాతో కూడా 50 మంది కొత్త వారిని పరిచయం చేయబోతున్నట్టు తెలిపిన తేజ త్వరలో సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నట్టు  వెల్లడించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రావడానికి ఇంకా సమయం పడుతుందని తాజా సమాచారం. ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక గోపీచంద్ హీరో 'అలివేలుమంగ వెంకటరమణ', రానాతో మరో సినిమా చేయబోతున్నట్టు ఇంతక ముందు వెల్లడించాడు తేజ.