కి‘లేడీ’..!

ABN , First Publish Date - 2021-08-04T07:00:14+05:30 IST

చిట్టీలు, గ్రూప్‌ ఫండ్‌ డిపాజిట్ల పేరుతో రూ.కోట్లు వసూలు చేసుకుని, పరారైంది ఓ కంపెనీ నిర్వాహకురాలు. ఆ బాగోతం మరువక మునుపే ముద్దిరెడ్డిపల్లిలో మరో మహిళ రూ.2 కోట్లకు కుచ్చుటోపీ పె ట్టిన విషయం వెలుగులోకి రావడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది.

కి‘లేడీ’..!

చిట్టీలు, గ్రూప్‌ డిపాజిట్ల పేరుతో 

జనం నుంచి డబ్బు వసూలు

తిరిగి చెల్లించకుండా పరార్‌..

రూ.25 కోట్లకు కుచ్చుటోపీ

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

తాజాగా ముద్దిరెడ్డిపల్లిలో రూ.2 కోట్లు 

ఎగ్గొట్టిన మరో మహిళ

హిందూపురం, ఆగస్టు 3: చిట్టీలు, గ్రూప్‌ ఫండ్‌ డిపాజిట్ల పేరుతో రూ.కోట్లు వసూలు చేసుకుని, పరారైంది ఓ కంపెనీ నిర్వాహకురాలు. ఆ బాగోతం మరువక మునుపే ముద్దిరెడ్డిపల్లిలో మరో మహిళ రూ.2 కోట్లకు కుచ్చుటోపీ పె ట్టిన విషయం వెలుగులోకి రావడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. పట్టణంలోని సత్యనారాయణ పేటలో సోమవారం వైవీఏ గ్రూప్‌ డిపాజిట్ల నిర్వాహకురాలు విజయలక్ష్మి రూ.25 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టి, పరారైన వైనం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయం చేయాలంటూ మంగళవారం బాధితు లు జాతరలా పోలీసు స్టేషన్లకు క్యూకట్టి, ఫిర్యాదు చేశారు. ఈ మె కొన్నేళ్లుగా డిపాజిట్ల రూ పంలో నెలవారీ రూ.1000 మొ దలుకుని ఏడాది, మూడేళ్లు గడువుతో డిపాజిట్‌దారులకు రెట్టింపు మొత్తం ఇచ్చేది. గ డు వు తీరిన డిపాజిట్లకు అధిక వడ్డీలకు ఆశపడిన జనం గ్రూప్‌ డిపాజిట్లు చేయడానికి క్యూకట్టారు. ఇలా వేలాది మంది నుంచి కోట్లలో డిపాజిట్లు కట్టించుకుంది. పది మందికిపైగా ఏజెంట్లతోపాటు అకౌంటెట్లను సైతం నియమించుకుని హిందూపురం, మడకశిర, పెనుకొండ, గోరంట్ల, పావగడ, బాగేపల్లి తదితర ప్రాంతాల్లో బ్రాంచలు ఏర్పాటు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలలుగా వేలాది మంది డిపాజిట్లకు గడువు ముగిసినా తిరిగి సొమ్ము చెల్లించకపోగా ఇటీవల కొవిడ్‌ కారణంగా ఇచ్చిన రుణాలు వసూలు కాలేదని దాటవేస్తూ వచ్చింది. అదనంగా వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు భాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఇవ్వకపోవడంతో మోసపోయిన డిపాజిట్‌దారులు సత్యనారాయణపేటలో నిర్వాహకురాలి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం టూటౌన పోలీసు స్టేషనలో వందలాది మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ప్రభుత్వ పెన్షనర్ల నుంచి రోజువారి కూలీ వరకు అన్నివర్గాల వారు ఉన్నారు. ఇదే వరుసలోనే మంగళవారం ముద్దిరెడ్డిపల్లిలో గ్రూప్‌ డిపాజిట్ల పేరుతో ఓ మహిళ రూ.2కోట్లకుపైగా వసూలు చేసుకుని, చేతులేత్తేసిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళల ఫిర్యాదు వనటౌన పోలీసులు స్టేషనకు చేరింది. చిట్టీలు, గ్రూప్‌ డిపాజిట్‌ నిర్వాహకుల మోసాలు ఒక్కొక్కటిగా హిందూపురంలో వెలుగులోకి రావడంతో ఆందోళన మొదలైంది. గ్రూప్‌ డిపాజిట్ల నిర్వాహకురాలి చేతిలో మోసపోయిన వారికి ఏ మేరకు న్యాయం చేకూరుతుందనేది ప్రశార్థకంగా మారింది. 

సత్యనారాయణపేట, ముద్దిరెడ్డిపల్లి గ్రూప్‌ డిపాజిట్ల నిర్వహకుల చేతిలో మోసపోయిన వారిలో 90 శాతం మహిళలే ఉన్నారు. ఈనేపథ్యంలో పట్టణంలో చీటీలు, గ్రూప్‌ డిపాజిట్ల నిర్వాహకులకు చెల్లించిన సొమ్ము భద్రతపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇలా కొన్నేళ్లుగా నిర్వాహకుల చేతిలో మోసపోవడం, తిరిగి దుప్పటి పంచాయితీతో సరిపెట్టుకోవడంతో పేదలు పోగుచేసుకున్న సొమ్ము పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో చిట్టీలు, గ్రూప్‌ డిపాజిట్ల నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. సత్యనారాయణపేటలో గ్రూప్‌ డిపాజిట్ల పేరుతో వసూలు చేసి, పరారైన విజయలక్ష్మిపై వందమందికిపైగా బాధితులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన సీఐ మన్సూరూద్దీన తెలిపారు.


Updated Date - 2021-08-04T07:00:14+05:30 IST