Abn logo
Aug 11 2021 @ 08:26AM

Chittoor: మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో డిటోనేటర్ల పేలుడు

చిత్తూరు: మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో డిటోనేటర్ల పేలుడు సంభవించాయి. బండ పగులకొట్టడానికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులు డిటోనేటర్ల అమర్చి పేల్చారు. దీంతో బండాళ్లు డిటోనేటర్లతో పేల్చడంతో పెద్ద పెద్ద బండరాళ్లు వచ్చి ఇంటిపైన పడటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇళ్ల మధ్య పేల్చడం ఏంటని జనాలు షాపింక్ కాంప్లెక్స్ నిర్వహకులపై ఆగ్రహం చెందారు. అక్కడి జనాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.