Abn logo
Aug 23 2021 @ 12:17PM

చిత్తూరు: దళిత గ్రామాల్లో విద్యుత్ చార్జీల వసూళ్ల డ్రైవ్

చిత్తూరు: జిల్లాలోని వెదురుకుప్పం మండలంలో గల దళిత గ్రామాల్లో విద్యుత్ శాఖ విద్యుత్ చార్జీల వసూళ్ల డ్రైవ్  నిర్వహించింది. ఇందులో భాగంగా బిల్లులు చెల్లించని కారణంగా కనెక్షన్ల తొలగింపుకు విద్యుత్ శాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలను గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మండల కేంద్రమైన వెదురుకుప్పం సహా యనమలమంద దళితవాడలో విద్యుత్ అధికారులు విద్యుత్ బకాయిలను చెల్లించాలని వేధిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.