Chittoor: వేణుగోపాలస్వామి ఆలయంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2021-08-29T13:42:51+05:30 IST

కార్వేటినగరం మండలం వేణుగోపాలస్వామి ఆలయంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య ప్రసాదాల వ్యవహారంపై టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం

Chittoor: వేణుగోపాలస్వామి ఆలయంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం

చిత్తూరు: కార్వేటినగరం మండలం వేణుగోపాలస్వామి ఆలయంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య ప్రసాదాల వ్యవహారంపై టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎక్కువ మొత్తంలో వడలు, జీలేబీలు వంటి ప్రసాదాలను చేయించి విక్రయించడానికి టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రయత్నిస్తున్నారని సెక్యూరిటీ గార్డు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం తలెత్తింది. ఈ విషయం ఆలయ అధికారులు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-08-29T13:42:51+05:30 IST