Chittoor: పూతలపట్టులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-04-16T17:57:57+05:30 IST

జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో మహా మేధావి, మానవతావాది, బహుముఖ ప్రజ్ఞా శాలి డా.బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Chittoor: పూతలపట్టులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో మహా మేధావి, మానవతావాది, బహుముఖ ప్రజ్ఞా శాలి డా.బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూరోప్ టీమ్ కిషోల్ చలసాని ఆధ్వర్యంలో శ్రీనివాస్ గోగినేని, నవీన్ సామ్రాట్ జలగడుగు సమన్వయంతో పూతలపట్టు ఎస్సీ సెల్ అధ్యక్షులు కే సుబ్బరాజులు పూతలపట్టు అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు. బడుగు బలహీన దళిత వర్గాలకు ఆ మహనీయుడు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పూతలపట్టు మండల, గ్రామ స్థాయి నాయకులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పించారు.

Updated Date - 2022-04-16T17:57:57+05:30 IST