Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిత్తూరు జిల్లాలో వింత సంఘటన..

చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం, పెద్దకన్నలి గిరిజన కాలనీలో సుబ్రమణ్యం ఇంట్లో వింత చోటు చేసుకుంది. సాధారణంగా కోడిపెట్ట గుడ్లుపెట్టి పిల్లల్ని పొదగడం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా పుంజుకోడి గుడ్లు పెట్టి పెల్లల్ని పొదిగింది. ఈ వింత వార్త కాస్త సమీప గ్రామాలకు తెలియడంతో ఈ వింతను చూసేందుకు సుబ్రమణ్యం ఇంటికి వస్తున్నారు.


సుబ్రమణ్యం ఇంట్లో నాటు కోడుపుంజు గుడ్లుపెట్టి, పిల్లలను పొదిగి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. అయితే జన్యు లోపంవల్ల అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వెటర్నరీ డాక్టర్ చెబుతున్నారు.

Advertisement
Advertisement