చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-11-11T17:49:14+05:30 IST

చిత్తూరు: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది.

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు

చిత్తూరు: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. చిత్తూరు, మదనపల్లి, తిరుపతి ప్రాంతాలలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. పలమనేరు సమీపంలోని కైగల్ జలపాతంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మదనపల్లి డివిజన్, సంబళ్లపల్లి, నిమ్మలపల్లి ప్రాంతాల్లో ఉన్న పెద్దేరు, బాహుదా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి.


చిత్తూరు సమీపంలోని ఎన్టీఆర్ జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని బయటకు వదులుతున్నారు. కార్వేటి నగర్ మండలంలోని కృష్ణాపురం ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండిపోయింది. అలాగే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2021-11-11T17:49:14+05:30 IST