చిత్తూరు జిల్లాలో కారు బీభత్సం

ABN , First Publish Date - 2021-12-29T18:01:28+05:30 IST

చిత్తూరు జిల్లా: పలమనేరులో కారు బీభత్సం సృష్టించింది.

చిత్తూరు జిల్లాలో కారు బీభత్సం

చిత్తూరు జిల్లా: పలమనేరులో కారు బీభత్సం సృష్టించింది. కల్వర్టు గోతిలోకి దూసుకుపోయింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. పక్కనే ఉన్న కిరాణా దుకాణం పాక్షికంగా ధ్వంసమైంది. గోతిలోనే కారు చిక్కుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారులో డ్రైవర్ తప్ప ప్రయాణీకులు ఎవరూ లేరు. ప్రస్తుతం డ్రైవర్ పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలియవచ్చింది. 

Updated Date - 2021-12-29T18:01:28+05:30 IST