Abn logo
Sep 10 2021 @ 09:47AM

వరసిద్ధి వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి Peddireddy

చిత్తూరు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం దేవాలయంలో వినాయక చవతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు వైసీపీ ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వినాయకుని అండదండలు ఉండేలా చూడాలని కోరుకుంటున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.