రామసముద్రం పోలీస్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-09-17T15:57:55+05:30 IST

జిల్లాలోని రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రామసముద్రం పోలీస్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం

చిత్తూరు: జిల్లాలోని రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామసముద్రం మండలం రాగిమకులపల్లి పంచాయతీ ప్యాడరాసిపల్లికి చెందిన గంగిరెడ్డి... గ్రామంలో ఓ మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని రెండురోజుల క్రితం స్టేషన్లో ఫిర్యాదు అందించింది. ఈ క్రమంలో గంగిరెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈరోజు ఉదయం గంగిరెడ్డి కత్తితో గొంతుకోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని మొదటగా స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్సనందించి పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-09-17T15:57:55+05:30 IST