Abn logo
Sep 19 2021 @ 08:44AM

కంటికి రెప్పలా కాపాడుకుంటున్న నాయకుడు

దూరదృష్టితో.. కరోనాపై యుద్ధం చేస్తున్న లీడర్

చిత్తూరు: నాయకుడంటే విజన్ ఉండాలి. దూరదృష్టి అనేది ఉన్నప్పుడే సత్ఫలితాలు వస్తాయి. చిత్తూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ అలాంటి విజన్‌తోనే పని చేస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు నాయుడి స్ఫూర్తితో చిత్తూరు టౌన్ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నుంచి తన నియోజకవర్గ ప్రజలను రక్షించుకోవడానికి నానా రకాలుగా పాటుపడుతున్నారు. దూరదృష్టితో ఆలోచించి.. కరోనా వైరస్ విజృంభించకుండా.. సొంత నిధులతో డాక్టర్లను నియమించి.. ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోగులకు మందులు పంపిణీ చేస్తూ కరోనాను తరిమికొట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.  అంతేకాదు గత జూలైలో సుమారు రెండు లక్షల మందికి ఆనందయ్య మందులను పంపిణీ చేశారు. 


గతేడాది నుంచి సుమారు 52 వారాలుగా నియోజకవర్గం ప్రజల కోసం తనవంతుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. లాక్ డౌన్‌లో ఆహార పంపిణీ నుంచి మొదలు పెట్టుకుని.. అత్యవసర వైద్య సేవల వరకు అన్నిటికీ నేనున్నానంటూ ముందుకొచ్చారు. చిత్తూరు పట్టణంలో మహమ్మారి బారిన పడి.. వైద్య సేవల కోసం ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడం విశేషం. 


హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి  వారి ఇంటి వద్దకే డాక్టర్లు వెళ్లి  పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పట్టణ ప్రజలెవరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్త లు పాటించాలని.. ఒకవేళ కరోనా వస్తే.. ధైర్యంగా ఉండాలని బాలాజీ పిలుపునిచ్చారు. నిరుపేదలు ఎవరైనా తమను సంప్రదిస్తే తక్షణం వారికి వైద్య సహాయం చేస్తామన్నారు. పట్టణంలోని 50వార్డులలో కరోనా కారణంగా పేదలు ప్రాణాలు కోల్పోకుండా తనవంతు సహాయం చేయడానికి బాలాజీ కృషి చేశారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కోరల నుంచి ప్రజలను రక్షించడానికి ఆయన చేస్తున్న కృషి... ప్రభుత్వాలకు కూడా కనువిప్పు కలిగిస్తుందని అంటున్నారు.