Abn logo
Sep 20 2021 @ 13:23PM

చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం

చిత్తూరు: జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. రామచంద్రపురం మండలం నెత్త కుప్పం పంచాయతికి చెందిన కే.రమణమ్మ పురుగుల మందు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అగ్రవర్ణాలకు చెందిన రైతులు తమపై దాడి చేస్తున్నారని, ఎన్నిసార్లు కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన చెంది బలవన్మరణానికి యత్నించింది. కలెక్టర్, ఎస్పీలను నుంచి న్యాయం జరగలేదని మనస్తాపంతో కలెక్టర్ కార్యాలయంలో మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. 

ఇవి కూడా చదవండిImage Caption