ఘనంగా దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-01-21T05:26:42+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలు బుధ వారం ఒంగోలులో ఘనంగా జరిగాయి.

ఘనంగా దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలు
జనార్దన్‌కు పూలమాల వేసి శుభాకాంక్షలు చెబుతున్న నాయకులు

ఒంగోలు (కార్పొరేషన్‌) జనవరి 20 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలు బుధ వారం ఒంగోలులో ఘనంగా జరిగాయి. ముందుగా స్వగ్రామమైన తూ ర్పునాయుడుపాలెంలో ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం దామచర్ల జనార్దన్‌ దంపతులు వల్లూరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో అభిమాను ల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దామచర్ల కేక్‌ కట్‌ చేశారు. ఈ సం దర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన ఆత్మీయులు, అభిమానులు ఆయన కు శుభాకాంక్షలు తెలిపారు. దాంతోపాటు రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి ఆధ్వర్యంలో వేద పండితుల ఆశ్వీరచనం అందించారు. దర్శి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పమిడి రమేష్‌, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రామా గోపి, కామేపల్లికి చెందిన దామచర్ల మిత్రు డు చాగంటి శ్రీహరి, జిల్లా నాయకులు బండారు మదన్‌, దొడ్డవరం గ్రా మానికి చెందిన నిడదాల ఆంజనేయులు, నగర కార్యదర్శి దాయనేని ధ ర్మ, అధికార ప్రతినిధి నండూరి చంద్ర, నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వ రరావు, ఒంగోలు పార్లమెంట్‌ మహిళాధ్యక్షురాలు రావుల పద్మజ, నగర అధ్యక్షురాలు పసుపులేటి వెంకటసునీత, డాక్టర్‌ లంకా ప్రసన్నకుమార్‌, కె.కాశిబాబు, శేషమ్మ, శివకుమారి, పలువురు పార్టీ శ్రేణులు దామచర్లకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.


శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు


కాగా దామచర్ల జనార్దన్‌ జన్మదినం సందర్భంగా మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి లోకేష్‌ కూడా దామచర్లకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.


Updated Date - 2021-01-21T05:26:42+05:30 IST