చాక్లెట్‌ కేక్‌

ABN , First Publish Date - 2021-12-25T20:25:07+05:30 IST

మైదా - ఒక కప్పు, పంచదార పొడి - ఒక కప్పు, కొకో పౌడర్‌ - అర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - ఒక టీస్పూన్‌

చాక్లెట్‌ కేక్‌

కావలసినవి: మైదా - ఒక కప్పు, పంచదార పొడి - ఒక కప్పు, కొకో పౌడర్‌ - అర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - ఒక టీస్పూన్‌, ఉప్పు - అర టీస్పూన్‌, నూనె - అర కప్పు, వేడి నీళ్లు - అర కప్పు, పాలు - అర కప్పు, వెనీలా ఎసెన్స్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, ఒక బేకింగ్‌ టిన్‌. 


తయారీ: ఒక పాత్రలో మైదా, పంచదార, కొకో పొడి, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో అరకప్పు నూనె, అరకప్పు వేడి నీళ్లు పోసి రెండూ కలిసే వరకు కలియబెట్టాలి. తరువాత దీనిలో పాలు, వెనీలా ఎసెన్స్‌, పెరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా పోస్తూ కలియబెట్టాలి. మెత్తటి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని టిన్‌లో పెట్టి 160 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద 35 నుంచి 40 నిమిషాల పాటు బేక్‌ చేస్తే చాక్లెట్‌ కేక్‌ రెడీ.

Updated Date - 2021-12-25T20:25:07+05:30 IST