Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాక్లెట్‌ మోదకం

కావలసిన పదార్థాలు: కోవా- కప్పు, చాక్లెట్‌ చిప్స్‌- ముప్పావు కప్పు, చక్కెర- రెండు స్పూన్లు, యాలకుల పొడి- పావు స్పూను, నెయ్యి- స్పూను.


తయారుచేసే విధానం: ముందుగా ఓ పాన్‌మీద కోవాను వేడిచేయాలి. కాసేపటికి కోవా కరగడం మొదలవుతుంది. అప్పుడు చక్కెరను వేసి బాగా కలపాలి. ఇందులోనే చాక్లెట్‌ చిప్స్‌ను కూడా వేయాలి. చాక్లెట్‌ అంతా కరిగి కోవాలో కలుస్తుంది. అలాగే కలుపుతుంటే ఈ మిశ్రమం అంతా ముద్దగా మారుతుంది. వెంటనే దీన్ని ఓ గిన్నె లేదా ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముద్దలుగా చేసి అచ్చులో వేసి మోదకంలా వత్తుకోవాలి. లేదా చేత్తో చేసినా పర్వాలేదు.

డ్రై ఫ్రూట్‌ హల్వాడేట్స్‌ ఖీర్‌బాదం బర్ఫీప్రొటీన్‌ లడ్డూచక్కెర పొంగల్‌మలై లడ్డూముంబయి కరాచీ హల్వాబాదం హల్వాశంకరపాలితిల్‌ పీఠా
Advertisement