Abn logo
Sep 26 2021 @ 02:11AM

చోళపురంలో బయల్పడిన రాజప్రాసాదం

చెన్నై, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని అరియలూరు జిల్లా గంగైకొండ చోళపురంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో చోళుల కాలం నాటి రాజప్రాసాదం బయల్పడింది. అంతఃపురం నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు 23,13,5 సెంటీమీటర్ల ఎత్తు, 30,15,8 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తుల్లో ఉన్నాయి. అద్దాలు, గాజులు, మట్టిపాత్రలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. చోళుల కాలం నాటి నాణేలు కూడా భారీగా లభ్యమయ్యాయి. మొదటి రాజేంద్రచోళుడి పాలనా కాలం క్రీ.శ.1012 నుంచి 1044 వరకు కొనసాగగా, ఈయన పాలనలో ప్రజలు ఎంతో సంపన్నులుగా ఉన్నట్టు ఇక్కడ లభ్యమైన వస్తువుల ద్వారా తెలుస్తోందని పురావస్తుశాఖ డైరెక్టర్‌ నందకుమార్‌, జాయింట్‌ డైరెక్టర్‌ రాజలక్ష్మి తెలిపారు.