Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమె అందానికి చిరునామా.. కథక్‌లో పీజీ పూర్తి చేసింది.. మనసు పడినవాడు పెళ్లికి నిరాకరించడంతో..

కథక్ నృత్యంలో ఎంఏ ఉత్తీర్ణురాలైన ఆ 24 ఏళ్ల యువతి విషం తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే కన్నుమూసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పరిధిలోని పరదేశ్పురాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి పేరు కాజల్ ఇంజె. ఆమె నవంబరు 12న విషం తీసుకుంది. 

దీనికి కారణం చెప్పేందుకు ఆమె కుటుంబ సభ్యులు తొలుత నిరాకరించారు. తరువాత ప్రేమలో వైఫల్యమే దీనికి కారణమని తెలిపారు. ఆమె నాలుగైదు నెలలుగా ఒక యువకుడిని ప్రేమిస్తోంది. మొదట ఆ యువకుడు పెళ్లికి ఓకే చెప్పాడు. తరువాత ఏమైందో ఏమో.. అతను ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. కాగా అతను ఆమెను వేధింపులకు గురిచేశాడని కాజల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుందని వారు అంటున్నారు. కాజల్ తండ్రి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా తల్లి గృహిణి. కాజల్ అక్కకు ఇటీవలే వివాహమయ్యింది. సోదరుడు చదువుకుంటున్నాడు. కాజల్ ఉత్తమ డాన్సర్‌గానూ గుర్తింపు పొందింది. పలు ఈవెంట్‌లలో ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె ఆత్మహత్యతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement