సెల్‌ఫోన్ల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-07-24T03:32:31+05:30 IST

సెల్‌ఫోన్ల చోరీ కేసులో నిందితుడిని శుక్రవారం 1వ పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు విలేకర్లకు సీఐ శ్రీనివాసరావు నిందితుడి వివరాలు వెల్లడించారు.

సెల్‌ఫోన్ల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

రూ.14,900 విలువగల ఫోన్లు స్వాధీనం

కావలి రూరల్‌, జూలై 23: సెల్‌ఫోన్ల చోరీ కేసులో నిందితుడిని శుక్రవారం 1వ పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు విలేకర్లకు సీఐ శ్రీనివాసరావు నిందితుడి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కావలి పట్టణంలోని అరటితోట ప్రాంతానికి చెందిన షేక్‌ వీరామొద్దీన్‌ ఈ నెల 20వ తేదీన తన ఇంటి గ్రిల్స్‌కు తాళం వేసి వరండాలో నిద్రించగా గుర్తుతెలియని దుండగులు తాళం తీసి 3 సెల్‌ఫోన్లను అపహరించుకెళ్లారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ బాజిబాబు, కానిస్టేబుల్‌ హరిబాబు, శ్రీహరితో ఒక టీముగా కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు లభించిన ఆధారాలతో అంబేద్కర్‌ నగర్‌ మోడల్‌ కాలనీకి చెందిన బట్ట వినోద్‌కుమార్‌ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి రూ.14,900 విలువగల 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ బాజిబాబు, పోలీస్‌ సిబ్బందిని డీఎస్సీ ప్రసాద్‌ అభినందించారు.

Updated Date - 2021-07-24T03:32:31+05:30 IST