చిన్నారికి ‘లాక్‌డౌన్ యాదవ్’ అని పేరు.. ఎంపీ సీఎం శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-05-26T02:04:03+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఉదయ్‌భాన్ సింగ్ యాదవ్, రీనా అనే దంపతులు మహారాష్ట్రకు వలస వెళ్లారు. కాగా గురువారం మహారాష్ట్ర నుంచి సొంతూరికి శ్రామిక్ ప్రత్యేక రైలులో ఉత్తరప్రదేశ్‌లోని సొంతూరికి ప్రయాణమయ్యారు

చిన్నారికి ‘లాక్‌డౌన్ యాదవ్’ అని పేరు.. ఎంపీ సీఎం శుభాకాంక్షలు

భోపాల్: తమకు పుట్టిన బిడ్డకు ‘లాక్‌డౌన్ యాదవ్’ అని పేరు పెట్టింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ జంట. కాగా లాక్‌డౌన్ యాదవ్‌కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీవెనలు అందించారు. తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి ఆరా తీసిన ఆయన.. వారిని జాగ్రత్తగా తమ స్వస్థలానికి పంపించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.


ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఉదయ్‌భాన్ సింగ్ యాదవ్, రీనా అనే దంపతులు మహారాష్ట్రకు వలస వెళ్లారు. కాగా గురువారం మహారాష్ట్ర నుంచి సొంతూరికి శ్రామిక్ ప్రత్యేక రైలులో ఉత్తరప్రదేశ్‌లోని సొంతూరికి ప్రయాణమయ్యారు. నిండు గర్భవతైన రీనా మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌‌కు రాగానే పురిటి నొప్పులతో ఇబ్బంది పడింది. ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వానికి తరలించారు. రీనాకు మగబిడ్డ జన్మించాడు. ‘‘అతడు లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో పుట్టాడు కాబట్టి, అతడి పేరును లాక్‌డౌన్ యాదవ్‌ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం’’ అని తల్లి రీనా పేర్కొంది.

Updated Date - 2020-05-26T02:04:03+05:30 IST