కోక్‌ వద్దు.. నీళ్లు తాగండి!

ABN , First Publish Date - 2021-06-16T06:41:55+05:30 IST

పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘యూరో 2020’ గేమ్స్‌లో మంగళవారం హంగేరితో మ్యాచ్‌కు ముందు కోచ్‌ ఫెర్నాండో సాంటో్‌సతో...

కోక్‌ వద్దు.. నీళ్లు తాగండి!

బుడాపెస్ట్‌ (హంగేరీ): పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘యూరో 2020’ గేమ్స్‌లో మంగళవారం హంగేరితో మ్యాచ్‌కు ముందు కోచ్‌ ఫెర్నాండో సాంటో్‌సతో కలిసి కెప్టెన్‌ రొనాల్డో మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టేబుల్‌పై రెండు కోకాకోలా బాటిళ్లు ఉండడాన్ని రొనాల్డో గమనించాడు. వాటిని పక్కనపెట్టేసిన రొనాల్డో శీతల పానీయాల బదులు అందరూ మంచి నీళ్లు తాగండంటూ వాటర్‌ బాటిల్‌ చూపిస్తూ సలహా ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. యూరో గేమ్స్‌కు కోకాకోలా అధికారిక స్పాన్సర్‌ కావడం గమనార్హం. ఇప్పటికైతే రొనాల్డోపై నిర్వాహకులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. 

Updated Date - 2021-06-16T06:41:55+05:30 IST