చుక్కలు చూపిస్తున్న సరుకుల ధరలు..!

ABN , First Publish Date - 2021-06-18T05:55:37+05:30 IST

కరోనా, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నిత్యావసరాతోపాటు పూలు, పండ్లు, నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నా యి.

చుక్కలు చూపిస్తున్న సరుకుల ధరలు..!
ధరలు పెరగడంతో కొనుగోలుదారులు లేక ఖాళీగా ఉన్న కూరగాయల దుకాణం

మరుగుతున్న నూనెలు

మండుతున్న కూరగాయలు, నిత్యావసరాలు

అందనంత దూరంలో ఫ్రూట్స్‌, డ్రైఫ్రూట్స్‌

కొండెక్కిన చికెన్‌, మటన్‌ ధరలు

పొదిలి(రూరల్‌) జూన్‌ 17 : కరోనా, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నిత్యావసరాతోపాటు పూలు, పండ్లు, నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నా యి. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విపత్కర పరిస్థితుల్లో ధరలు సామాన్యులకు కన్నీటి కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఉపాధిలేక తిండికి ఇబ్బందులు ఎదుర్కోంటు న్న తరుణంలో నిత్యావసరాలు కొండెక్కి కూర్చున్నాయి. కరోనా అన్ని విధాల తీరనిదెబ్బ తీసిందని ప్రజలు వాపోతున్నారు. ప్రాణాలతోపాటు  ఆర్థికంగా దెబ్బతీసిందని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇమ్యూనిటీ పవర్‌ పెం చుకొని ప్రాణాలను దక్కించకోవాలని బలమైన ఆహారం తీసుకోవాలని ఆసక్తి చూపుతున్న మధ్యతరగతి ప్రజ లకు పెరిగిన ధరలు అడ్డుకట్ట వేస్తున్నాయి. కొని తినలేని స్థితి లో నిత్యావసరాలు ఉన్నాయి. ని త్యావసరాలతోపాటు కూరగాయ లు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌, చికెన్‌, మ టన్‌ వంటివి ఆకాశమే హద్దుగా సామాన్యుడికి అందనంత దూ రంలో అమాంతం పెరిగాయి.  రో జువారీగా మార్కెట్‌లో ధరలు భ గ్గుమంటున్నాయని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. దీంతో సామాన్యుడు దిక్కుతోచని స్థి తిలో కొట్టుమిట్టాడుతు దీన స్థితి లో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అం దులో కర్ఫ్యూతో సమయం కుదించడంతో వ్యాపారులకు అడ్డే లేకుండాపోయింది. మొదటి వేవ్‌లో పెరిగిన ధరలు అదుపులోకి రాకముందే  రెండో వేవ్‌ కరోనా రావడంతో నిత్యవసరాలు రెట్టింపు అయ్యాయి. రోజువారీ అవసరాల్లో ఒకటైన వంటనూనె లాక్‌డౌన్‌కు ముందు రూ.65  రెండోసారి రూ.160కి చేరింది. ఆ విధంగా అన్నిరకాల పప్పుల ధరలు ఇదే విధంగా పెరిగిపోయాయి.  ఇక డ్రైఫ్రూట్స్‌ ధరలు చెప్పనవసరం లేదు. అది పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాలు కొనలేనంతగా పెరిగాయి.  ఇమ్యునిటీపవర్‌  ఉంటే కరోరాను జయించవచ్చని వైద్యు లు చెప్తున్న క్రమంలో ప్రజలు పౌష్టికాహారంవైపు దృష్టి సారిం చారు.  దీంతో వాటి ధరలు కూ డా పైకి ఎగబాకాయి.  బాదంపప్పు కేజీ రూ.700, రూ.జీడిప ప్పు కేజీ రూ.800, పిస్తా రూ. 1200, ఎండు ఖర్జూరం రూ.400, నల్లద్రాక్ష రూ.400, ఫ్రూట్స్‌ దాని మ్మ కాయ 50, యాపిల్స్‌ 3 కా యలు 100, జామ కేజీ రూ.50, అరటి కాయ లు డజను రూ.60, చక్కెరకేళి రూ.100 వరకు పెరిగిపోయాయి.  డ్రైఫ్రూట్స్‌ కొందామని వెళ్లిన ప్రజలు వాటి ధరలుచూసి ఆశ్చ ర్యానికి గురవుతున్నారు. దీంతో ఏమీ కొనుగోలు చేయకుండానే వెను దిరుగుతున్నారు.  ఇదే అదునుగా తీసుకొని కొందరు వ్యాపారులు రోజుకో విధంగా ధరలు పెంచి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. మొదటి వేవ్‌లో ఉచితంగా ఇచ్చిన చికెన్‌ ఽ ప్రస్తుతం భారీగా పెంచారు. తర్వాత కొద్ది రోజుల పాటు రూ.150 నుంచి రూ.170 వరకు ఉన్నా ఇప్పుడు రూ.250కి చేరింది. మటన్‌ ధర రూ.700 మించిపోయింది. అదే విధంగా కూరగాయల ధరలుక ూడా ఒక్క టమాట మినహా అన్ని ధరలూ రెట్టింపుతో విక్రయిస్తున్నారు. ఆంక్షల పేరుతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యాపారులు అమ్మకాలు జరపడంతో సామాన్యుడు ఏమి కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 


Updated Date - 2021-06-18T05:55:37+05:30 IST