సీఐ Nageswara Rao కేసులో దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2022-07-11T21:08:04+05:30 IST

సీఐ నాగేశ్వరరావు (CI Nageswara Rao) కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షలకు తరలించారు.

సీఐ Nageswara Rao కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌: సీఐ నాగేశ్వరరావు (CI Nageswara Rao) కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షలకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత హయత్‌నగర్‌ కోర్టుకు నాగేశ్వరరావును తరలించారు. తుపాకీతో బెదిరించి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేశ్వరరావును రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌వోటీ), వనస్థలిపురం పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఐపీసీ 307, 448, 365 సెక్షన్లు, ఆయుధాల చట్టం, సెక్షన్‌ 30 కింద కేసులు నమోదైన ఆయనను వనస్థలిపురం స్టేషన్‌లో విచారిస్తున్నట్లు రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ (Mahesh Bhagwat) తెలిపారు. కేసు దర్యాప్తును వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు సోమవారం నాగేశ్వరరావును రిమాండ్‌ కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా, గురువారం రాత్రి మహిళపై అఘాయిత్యం అనంతరం భర్తతో పాటు ఆమెను తన కారులో హైదరాబాద్‌ నుంచి దేవరకొండ తరలించడానికి ఇన్‌స్పెక్టర్‌ యత్నించారు.


ప్రతిచోటా దందాలే.. ఎమ్మెల్యేలూ బేఖాతరు

నాగేశ్వరరావు పనిచేసిన ప్రతిచోట భూ దందాలకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. మీడియా ప్రతినిధులతో కలిసి దందాలు చేస్తారని ఆరోపణలున్నాయి. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ (Banjara Hills Police Station) ఇన్‌స్పెక్టర్‌ పోస్టు కోసం రాత్రికి రాత్రి రాడిసన్‌ బ్లూ పబ్‌  మీద రైడింగ్‌కు వెళ్లారు.పై రైడ్‌ చేసి పేరు తెచ్చుకున్నారు. 3 నెలల క్రితం ఆ పోస్ట్‌ సాధించారు. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఫినిక్స్‌ అనే సంస్థకు మేలు చేకూర్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 60 మందిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలను ఖాతరు చేయలేదు. ఉన్నతాఽధికారుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. దీంతో మారేడ్‌పల్లికి బదిలీ అయ్యారు. 12 రోజుల కిందట బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా మహిళపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదుతో నాగేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2022-07-11T21:08:04+05:30 IST