సీఐడీ పోలీసుల ఉత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-01-22T22:12:48+05:30 IST

సీఐడీ పోలీసుల ఉత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్‌పై పోస్ట్ పెట్టాడని పవన్‌ఫణి అనే వ్యక్తిని శుక్రవారం సీఐడీ పోలీసులు

సీఐడీ పోలీసుల ఉత్యుత్సాహం

గుంటూరు: సీఐడీ పోలీసుల ఉత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్‌పై పోస్ట్ పెట్టాడని పవన్‌ఫణి అనే వ్యక్తిని శుక్రవారం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ  రోజు నిందితుడిని జడ్డి ఎదుట హాజరుపర్చారు. నిందితుడిపై పెట్టిన సెక్షన్లపై జడ్జి  అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్‌ఫణిపై రాజద్రోహంతో పాటు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సెక్షన్లు నమోదు చేశారు. ఆధారాలు లేకుండా ఇలాంటి సెక్షన్లు పెట్టడంపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం నిందితుడిని జైలులో ఉంచాలనే ఉద్దేశపూర్వకంగానే సెక్షన్లు పెట్టినట్లు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. పవన్‌ఫణి రిమాండ్‌ను జడ్జి తిరస్కరించారు.

Updated Date - 2022-01-22T22:12:48+05:30 IST