గుప్పు గుప్పున సిగరెట్ కాలుస్తున్న చింపాంజీ.. మనుషులకు ఏమాత్రం తగ్గట్లేదుగా..

ABN , First Publish Date - 2022-01-20T02:04:08+05:30 IST

దుస్తులు ఉతకడం, వాహనాలను శుభ్రం చేయడం తదితర పనులను మనుషులు చేసినట్లుగానే చేసే చింపాజీల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది...

గుప్పు గుప్పున సిగరెట్ కాలుస్తున్న చింపాంజీ.. మనుషులకు ఏమాత్రం తగ్గట్లేదుగా..

మనుషులను అనుకరించడంలో చింపాంజీలను మించి మరే జంతువులు చేయలేవు. మనుషులు చేసే పనులను అచ్చం అలాగే చేసే చింపాంజీలను చాలా చూశాం. దుస్తులు ఉతకడం, వాహనాలను శుభ్రం చేయడం తదితర పనులను మనుషులు చేసినట్లుగానే చేసే చింపాజీల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ చింపాంజీ అచ్చం మనుషుల మాదిరే సిగరెట్ తాగడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఓ జూను మరమ్మతులు చేసి నూతనంగా ప్రారంభించారు. సందర్శకులను ఆకర్షించేందుకు ఏదైనా కొత్తగా చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పలు జంతువులకు మనుషుల మాదిరి అనుకరించేలా ట్రైనింగ్ ఇప్పించారు. ఇందులో భాగంగా డల్లే అని పిలిచే చింపాంజీకి సిగరెట్లు కాల్చడంలో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం ఈ చింపాంజీ పర్‌ఫెక్ట్‌గా సిగరెట్లు కాల్చుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కేవలం దీన్ని చూడటానికే చాలా మంది సందర్శకులు వస్తున్నారట.

మీ ఇంటి కిటికీ కూడా ఇలాగే ఉందా.. అయితే ఇల్లు గుళ్లవడం ఖాయం.. వైరల్ అవుతున్న వీడియో


రోజుకి 40 సిగరెట్లకు పైగానే కాల్చేస్తుందట. లైటర్‌తో సిగరెట్ వెలిగించుకునే విధానం, కాలుతున్న సిగరెట్‌తో మరో సిగరెట్‌ను వెలిగించే విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తనను చూసేందుకు వచ్చిన వారికి ధన్యవాదాలు కూడా చెబుతోంది. అలాగే ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడే కోతులు.. కూడికలు, తీసివేతలు చేసే శునకాలు తదితర జంతువులు ఉన్నాయట. ఇదిలావుండగా, వినోదం పేరుతో జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పారాగ్లైడింగ్‌కు వెళ్లిన దంపతులు.. ఆకాశంలో భార్య వింత ప్రవర్తన.. నవ్వులు పూయిస్తున్న వీడియో



Updated Date - 2022-01-20T02:04:08+05:30 IST